ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట), నూతనకల్ : వర్షాభావం పరిస్థితులు నెలకొన్న కారణంగా రైతులు ఆరు తడి పంటల సాగు దిశగా ఆలోచన చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం ‘రైతులతో మాట.. పంటల మార్పిడికి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ (ఎస్), తుమ్మలపెన్‌పహాడ్ గ్రామాలను ఆయన సందర్శించారు. బంతి సాగు చేస్తున్న సోమిరెడ్డి వీరారెడ్డి తోటను పరిశీలించారు. తుమ్మలపెన్‌పహాడ్‌లో జటంగి సౌనయ్య పొలంలో ఉన్న పాలీహౌస్‌ను పరిశీలించారు. తక్కువ నీటితో కూరగాయలు, పూలు, పండ్లు సాగు చేస్తున్న సౌనయ్యను అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్‌లో పామాయిల్ తోటలో అంతర పంటగా సాగు చేసిన పెసరను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి భారతి, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ హరిసింగ్, ఏఓ సైదానాయక్, సర్పంచ్ గాడ్దుల లింగరాజు, ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ప్రత్యేక అధికారి విశాల్ దారా, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీఓ ప్రియాంక, వ్యవసాయ అధికారి దివ్య, హార్టికల్చర్ అధికారి స్వాతి, ప్రిన్సిపాల్ సరస్వతి, సర్పంచ్ కాటయ్య, తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


