బుల్లెట్‌ రైలు సాధించే వరకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు సాధించే వరకు ఉద్యమం

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

ఆత్మకూర్‌ (ఎస్‌) (సూర్యాపేట) : శంషాబాద్‌ నుంచి చైన్నెకి వెళ్లే బుల్లెట్‌ రైలును ముందుగా ప్రకటించిన ప్రకారం సూర్యాపేట మీదుగా కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. బుల్లెట్‌ ట్రైన్‌ను సాధించే వరకు ఉద్యమాలను ఉపేది లేదని స్పష్టం చేశారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామంలో సూర్యాపేట – దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని ఖండించారు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో రిటైర్డ్‌ డీఎం బయ్య మల్లికార్జున్‌, అఖిల పక్షాల నాయకులు తూడి నర్సింహారావు, అవిరె అప్పయ్య నర్సిరెడ్డి, బత్తుల ప్రసాద్‌, దండ వెంకట్‌రెడ్డి, గుండు రమేష్‌, బెల్లం కొండ యాదగిరి, గుంశావలి, ప్రశాంత్‌ రామనర్సు, గుండు రమేష్‌, కన్నయ్య, పందిరి మాధవరెడ్డి, నల్లగొండ నాగయ్య, దానియేల్‌, సుందరయ్య, కంచర్ల నర్సక్క, బాలాజీ, రాంరెడ్డి, నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement