స్వల్పంగా తగ్గిన మున్సిపల్‌ పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన మున్సిపల్‌ పోలింగ్‌

Feb 12 2026 7:18 AM | Updated on Feb 12 2026 7:18 AM

స్వల్పంగా తగ్గిన మున్సిపల్‌ పోలింగ్‌

స్వల్పంగా తగ్గిన మున్సిపల్‌ పోలింగ్‌

కోదాడ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ శాతం 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 2020లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 83.85 శాతం పోలింగ్‌ నమోదు కాగా 2026లో అది 81.38 శాతానికి పడిపోయింది. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే 2.47 ఽశాతం పోలింగ్‌ తగ్గింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో పోలింగ్‌ శాతం తగ్గగా, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పోలింగ్‌ శాతం స్పల్పంగా పెరిగింది. కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలలో పోలింగ్‌ శాతం స్పల్పంగా తగ్గింది.

ఫ 2020 ఎన్నికల్లో 83.85 శాతం నమోదు

ఫ తాజాగా 81.38 శాతమే పోలింగ్‌

ఫ గతంలో కన్నా 2.47 శాతం తక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement