పుర పోలింగ్ ప్రశాంతం
సూర్యాపేట టౌన్ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. ఉదయం కాస్త మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం వరకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల పరిధిలో 1,75,759 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 79.90 శాతం ఓటింగ్ నమోదైంది.
తిరుమలగిరిలో అత్యధికం..
కోదాడలో అత్యల్పం..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అత్యధికంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కోదాడ మున్సిపాలిటీలో పోలింగ్ నమోదైంది. తిరుమలగిరిలో 13,656 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 88.36శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే కోదాడలో 40,881 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 77.05 శాతం నమోదైంది.
మహిళా ఓటర్లే ఎక్కువ..
జిల్లాలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూర్‌నగర్‌లో పురుషులు 11,287 మంది ఓటు వేయగా మహిళలు 12,633 మంది ఓటు వేశారు. అలాగే కోదాడ లో పురుషులు 21,306 మంది, మహిళలు 19,568 మంది ఓటు వేశారు. నేరేడుచర్లలో పురుషులు 5,142 మంది, మహిళలు 5,750 మంది ఓటేశారు. సూర్యాపేటలో పురుషులు 41,199 మంది, మహిళలు 45192 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో పురుషులు 6,760 మంది, మహిళలు 6,896 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
137 వార్డుల్లో 372 కేంద్రాలు..
ఐదు మున్సిపాలిటీల్లోని 137 వార్డుల్లో పోలింగ్‌కు 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం నిర్వహించేందుకు 446 మంది పోలింగ్ అధికారులు, 446 మంది ఏపీఓలు, 1340 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల సజావు నిర్వహణకు 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులు, 10 ఎస్‌ఎన్టీ, 15 ఎఫ్‌ఎస్‌టీ, 7 వీవీటి, ఏటీ 7 బృందాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాయి. 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బ్యాలెట్ బాక్సులను 46 బస్సుల్లో పోలీస్ ఎస్కార్ట్ నడుమ భారీ బందోబస్తుతో పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు.
పోలింగ్ కేంద్రాలను
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ,
మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు జీఎస్ పాండాదాస్, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎన్నికల పరిశీలకుడు జీఎస్ పాండాదాస్ నేరేడుచర్ల మున్సిపాలిటీలో పరిశీలించారు. అలాగే కలెక్టర్, ఎస్పీలు వేర్వేరుగా సూర్యాపేటతోపాటు ఇతర మున్సిపాలిటీల్లో పోలింగ్‌ను పరిశీలించారు.
ఓటు హక్కు
వినియోగించుకున్న ప్రముఖులు..
పలువురు ప్రముఖులు తమ మున్సిపాలిటీల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోదాడలోని 14వ వార్డులో ఓటేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్పాపేటలోని 44వ వార్డులో ఓటేశారు. అలాగే జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ 14వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తను పోలీసులు కేంద్రం లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటకి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే సూర్యాపేట మున్సిపల్ పరిధి 13 వార్డు గాంధీనగర్‌లో టీఆర్పీ, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీ సులు అకారణంగా తమపై దాడి చేశారని నిరసిస్తూ సూర్యాపేట–జనగామ రహదారిపై టీఆర్‌పీ నాయకులు రాస్తారోకో చేశారు.
ఫ తిరుమలగిరిలో అత్యధికంగా 88.36 శాతం
ఫ కోదాడలో అత్యల్పంగా 77.05 శాతం
ఫ ఓటుహక్కు వినియోగించుకున్న
1,75,759 మంది ఓటర్లు
పుర పోలింగ్ ప్రశాంతం
పుర పోలింగ్ ప్రశాంతం
పుర పోలింగ్ ప్రశాంతం
పుర పోలింగ్ ప్రశాంతం
పుర పోలింగ్ ప్రశాంతం
పుర పోలింగ్ ప్రశాంతం


