సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేదల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీఓ శంకర్, వివిధ సంఘాల నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, చిన్న శ్రీరాములు, వి.సత్యనారాయణ, హుస్సేన్, పి.గామయ్య పాల్గొన్నారు.


