కేసుల దర్యాప్తు వేగవంతం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

కేసుల దర్యాప్తు వేగవంతం : ఎస్పీ

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

సూర్యాపేట : కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఎస్పీ కె.నరసింహ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్‌ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, ఎస్‌ఐలు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్‌నాథ్‌, శివతేజ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement