యూరియా కోసం సెల్ టవరెక్కిన రైతు
కోదాడ రూరల్ : ఫర్టిలైజర్ యాప్‌లో తనకు యూరియా బుకింగ్ కావడం లేదంటూ ఆగ్రహించిన ఓ రైతుల సెల్‌టవర్ ఎక్కాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో బీఎస్‌ఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన రైతు ఆకుల శ్రీనుకు నడిగూడెం మండలం ఎక్లాస్‌గానిపేట, ఖమ్మం జిల్లా చెరువుమాదారంలో నాలుగు ఎకరాల్లో వరిసాగు చేశాడు. అయితే యూరియా కోసం యాప్‌లో బుకింగ్‌కు ప్రయత్నిస్తున్నా బుకింగ్ కావడం లేదు. దీంతో విసుగుచెందిన రైతు సెల్‌టర్‌ఎక్కి నిరసనకు దిగాడు. యూరియా బుకింగ్ యాప్‌లో బుక్ కావడంలేదని, ఎరువుల దుకాణాలకు వెళితే స్టాక్ లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని కిందకు దిగమంటే తనకు యూరియా అందేవరకు దిగేదే లేదని నాకు ఐదు యూరియా కట్టలు కావాలని డిమాండ్ చేశాడు. కొద్ది సేపటికి రైతుతో మాట్లాడి యూరియా ఇప్పించే బాధ్యత తమదని నచ్చజెప్పి కిందకు దించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడకు వ్యవసాయాధికారులను పిలిపించి యూరియా యాప్‌పై అవగాహన కలిగించి యూరియా అందే విధంగా చేస్తామని పంపించారు.
టవర్ ఎక్కిన రైతు శ్రీను, కిందకు దిగాలని కోరుతున్న పోలీసులు
ఫ యాప్‌లో బుకింగ్
కావడం లేదని ఆవేదన
ఫ ఐదు బస్తాల యూరియా
ఇవ్వాలని డిమాండ్
యూరియా కోసం సెల్ టవరెక్కిన రైతు


