దద్దమ్మ ప్రభుత్వమని మంత్రే ఒప్పుకున్నడు | - | Sakshi
Sakshi News home page

దద్దమ్మ ప్రభుత్వమని మంత్రే ఒప్పుకున్నడు

Feb 12 2026 7:18 AM | Updated on Feb 12 2026 7:18 AM

దద్దమ్మ ప్రభుత్వమని మంత్రే ఒప్పుకున్నడు

దద్దమ్మ ప్రభుత్వమని మంత్రే ఒప్పుకున్నడు

సూర్యాపేట : కాంగ్రెస్‌ది దద్దమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి స్వయంగా ఒప్పుకున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నాకూడా బీఆర్‌ఎస్‌ తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారనడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీఆర్‌ఎస్సా అన్న సోయి కూడా మంత్రులకు లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పోలీసులు, అధికారులకు స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని అపోహ పడుతున్నారని, తమ హయాంలోనూ ట్యాపింగ్‌ జరుగుతుందని, చేతగాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టి బీఆర్‌ఎస్‌పై దాడులు చేస్తున్నారన్నారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌ చేయిస్తున్నది ముఖ్య మంత్రే అని ఆరోపించారు. సీఎం ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్‌ పెట్టి ఎన్నికలలో సహకరించాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాత్రి వేళల్లో కాంగ్రెస్‌ గుండాలు బైక్‌లపై హల్‌చల్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్‌ రాజ్యమేనని పేర్కొన్నారు.

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement