సూర్యాపేట, సూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో గురువారం జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లాడి సత్యనారాయణ గౌడ్, గోపగాని సుధాకర్ గౌడ్ గుణగంటి సురేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి వేణు సిద్ధార్థ్ గౌడ్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రవి, కార్యదర్శి సురభి శ్రీధర్ గౌడ్, తుంగతుర్తి డివిజన్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ గౌడ్, తండ అంజయ్య గౌడ్, బైరు విజయ్ గౌడ్, చిత్తలూరి రవీందర్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య గౌడ్, పులుసు శ్రీనివాస్ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, బాలగాని కుమార్ గౌడ్ పాల్గొన్నారు.


