సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని మిల్లర్లు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను ముంచుతున్నారు.
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
చికెన్ షాపులు బంద్
భానుపురి (సూర్యాపేట) : చికెన్ షాపులకు కోళ్లు సరఫరా చేసే యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపుల యజమానుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా చికెన్ షాపుల యజ మానులు తమ షాపులను బంద్ చేశారు. జిల్లాకేంద్రంలో షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి తమ నిరసన తెలిపారు. దీంతో చికెన్ షాపులు జనం లేక వెలవెలబోయి కనిపించాయి.
ప్రజల ప్రాణాలకు భరోసా
ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి ఆస్పత్రికి చేరుస్తున్నారు 108 సిబ్బంది.
- 8లో
నేడు గ్రామసభలు
భానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈ సభలు జరగనున్నాయి. ఈ గ్రామసభల్లో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి పేర్లను చదివి వినిపించనున్నారు. అలాగే గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇవే కాకుండా కాంగ్రెస్ ప్రజాపాలన తీరుపై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇందుకోసం వార్డు సభ్యుల నుంచి ప్రతి పౌరుడిని ఈ గ్రామసభలో భాగస్వామ్యం చేసేలా ఇప్పటికే ప్రచారం చేశారు. ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు కూడా అందజేశారు.
ఫ అంతటా ఏర్పాట్లు పూర్తి
ఫ గ్రామాల అభివృద్ధిపై
చర్చించనున్న అధికారులు


