సూర్యాపేట : ప్రతిఒక్కరూ చట్ట పరిధిలో బాధ్యతగా నడుచుకోవాలని ఎస్పీ కె.నరసింహ అన్నా రు. బుధవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.20 లక్షల విలువైనల 106 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులు కూడా కోల్పోతారన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR-పోర్టల్ (https-://www.ceir. gov.in)లో నమోదు చేసుకోవాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.


