భానుపురి (సూర్యాపేట) : మహనీయుల జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్.అంబేద్కర్ జయంతుల నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహనీయుల చరిత్ర అందరికీ తెలిసేలా విద్యా సంస్థల్లో వ్యాసచరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యక్రమం చేపట్టిందని అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించేందుకు గురువారం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజం అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారని, కులమతాలకు అతీకంగా ప్రజాప్రతినిధులు, నాయకులను ఈ గ్రామసభలకు ఆహ్వానించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారులు దయానందరాణి, శంకర్, నరసింహారావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


