నేటి నుంచి మూడు నెలల రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మూడు నెలల రేషన్‌

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

భానుపురి (సూర్యాపేట) : రేషన్‌ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఈ నెలలోనే ఇవ్వనున్నారు. జిల్లాలో 3,55,057 రేషన్‌ కార్డు దారులకు ప్రతినెలా 6వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. మూడు నెలలకు 18వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మొత్తం బియ్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసే అవకాశం లేక పోవడంతో రెండు విడతలుగా ఇవ్వనున్నారు. అవి కూడా సన్న బియ్యమే అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

- 8లో

మట్టపల్లి ఆలయంలో నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, నిత్యకల్యాణం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement