భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణుమాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జనగణనకు సిద్ధంగా ఉన్నాం
జనగణనకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. జనగణనకు సంబంధించి జనగణన రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలికేరి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


