నల్లగొండ టూటౌన్ : ఫార్మా రంగంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీయూలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–2026 అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయనశాస్త్ర విభాగంలో ఉన్న ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయ సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకొని పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అహ్మద్ కమాల్, రామాచారి, వసంత, వై.ప్రశాంతి, జ్యోతి, డి.రమేష్, ఆర్.రూప, ఎస్.కళ్యాణి, ఎ.శ్రీధర్‌రావు, ఎ.తిరుపతయ్య పాల్గొన్నారు.


