మహిళల స్వావలంబనకు అడుగులు | - | Sakshi
Sakshi News home page

మహిళల స్వావలంబనకు అడుగులు

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు బలమైన అడుగు అని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు రూ.10వేల కోట్ల ఆదా అయ్యిందన్నారు. 2023 డిసెంబర్‌ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళలను సన్మానించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మోరి శెట్టి నివేదిత, సంక్షేమ అధికారి నరసింహారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం సుచరిత, అడిషనల్‌ డీఆర్డీఓ సురేష్‌, సూర్యాపేట డిపో మేనేజర్‌ సునీత, కౌన్సిలర్‌ అరుణ పాల్గొన్నారు.

ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు

ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. ఏప్రిల్‌ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వైద్య, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, మైనింగ్‌ కార్య దర్శులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement