చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గృహహింస, వరకట్న మరణాలు వంటి నేరాలపై గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు.
లక్ష్మీనారసింహుడికి గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించిన అనంతరం మాంగల్యధారణ పూర్తిగావించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై అధిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయంలో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


