డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ నరసింహ, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపల్‌ కేంద్రంలో జోనల్‌ ఆఫీసర్‌, ఆర్‌ఓల వారీగా డీఆర్‌సీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచారంతో పాటు మున్సిపల్‌ ఏరియాలో సాయంత్రం 5 గంటల నుండి 11 తారీకు పోలింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు బంద్‌ చేయించాలని ఎకై ్సజ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌ లను డి జి టి వాహనంలో ముందు, వెనుక ఎస్కార్ట్‌ వాహనాలతో మాత్రమే స్ట్రాంగ్‌ రూములకు తరలించాలని, మిగిలిన బ్యాలెట్‌ పేపర్లను జాగ్రత్తగా కవర్లో పెట్టి సీల్‌ వేయాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను వార్డుల వారిగా విభజించి కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించాలని జోనల్‌ ఆఫీసర్లు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి పని చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్ల్లో అదనపు కలెక్టర్‌ సీతా రామారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, డీపీఓ నారాయణరెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, బీసీ సంక్షేమ అధికారి నరసింహ, సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement