అర్వపల్లి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం
అర్వపల్లి : రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ బోయలపల్లి రేఖ తెలిపారు. అర్వపల్లి ఆలయ అభివృద్ధికి సోమవారం దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటికే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.2లక్షల వ్యయంతో బోరు వేసి ట్యాంక్ నిర్మించి నీటి సమస్య తీర్చినట్లు చెప్పారు. అలాగే భక్తులకు శుద్ధ జలాలు అందించడం కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేసి క్రీడా సామగ్రిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దరూరి యోగానందచారి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్‌కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్‌గౌడ్, ఆలయ ధర్మకర్తలు జె.సోమయ్య, బి.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


