వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో కనుల పండువగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు అనుకూలంగా మోదీ ప్రభుత్వం
ఆత్మకూర్(ఎస్) : మానవ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అఖిల భా రత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, నాయకులు అలుగుబెల్లి వెంకట్‌రెడ్డి, డేగల వెంకటకృష్ణ, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, నరసింహారావు, నల్లగొండ నాగయ్య పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, బాలమురళికృష్ణ, రాజేష్, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.
వైభవంగా గరుడ వాహనసేవ
వైభవంగా గరుడ వాహనసేవ


