కాంగ్రెస్‌ను నమ్మితే అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను నమ్మితే అభివృద్ధి శూన్యం

Feb 9 2026 8:19 AM | Updated on Feb 9 2026 8:19 AM

కాంగ్రెస్‌ను నమ్మితే అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్‌ను నమ్మితే అభివృద్ధి శూన్యం

సూర్యాపేట టౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే అభివృద్ధి శూన్యమని, అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పథకాల్లోనే కోతలు పెడుతున్నరు తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిందా అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500, ఆడపిల్ల లకు స్కూటీల హామీలు ఏమయ్యాయన్నారు. జాబ్‌ క్యాలెండర్‌తో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని, రూ.పదివేలు ఉన్న రైతు బంధును రూ.పదిహేను వేలకు పెంచుతామని ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రెండేళ్లుగా తట్టెడు మట్టిపోయని కాంగ్రెసోళ్లు ఏం సాధించారని మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లడుగుతున్నారో నిలదీయాలన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అవినీతి పెరిగింది తప్ప.. రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. అన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి రాంచందర్‌నాయక్‌, ఆయా వార్డుల అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement