మత రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి
కోదాడ రూరల్ : సీఎం రేంవత్‌రెడ్డి ఎన్నికల సమయంలో మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం కోదాడ పట్టణంలో పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బైక్‌ర్యాలీ చేపట్టారు. అనంతరం రంగా థియేటర్ సెంటర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రధాని మోదీ సహకారంతో తన సొంతగడ్డ అయిన కోదాడ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందాలతోనే పనిచేస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీతలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, నరసింహారెడ్డి, మురళీధర్‌రెడ్డి, బండారు కవితారెడ్డి,వంగవీటి శ్రీనివాస్, అంజియాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, వెంకట్రామయ్య, నూనె సులోచన, యాదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


