మంత్రి ఉత్తమ్ మాటల్లో వాస్తవం లేదు
కోదాడ : అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లయ్యయాదవ్ మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి, 30 సంవత్సరాల్లో ఉత్తమ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ పార్టీ గెలిచినట్లు ఉత్తమ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోదాడకు 100 పడకల వైద్యశాలను మంజూరు చేయించింది తానేనని, ఉత్తమ్ తాను చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. లిప్టుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడమే ఉత్తమ్‌కు తెలిసిన విద్యఅని విమర్శించారు. కోదాడ మున్సిపాలిటీకి చెందిన శశ్మానస్థలాన్ని కూడా కబ్జా చేసిన చరిత్ర ఉత్తమ్ అనుచరులదని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె.నయీం, సురేష్‌నాయుడు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.


