అభివృద్ధే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తుంది | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తుంది

Feb 5 2026 7:11 AM | Updated on Feb 5 2026 7:11 AM

అభివృద్ధే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తుంది

అభివృద్ధే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తుంది

సూర్యాపేటటౌన్‌ : కేసీఆర్‌ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 6, 5, 31, 3, 22, 39 వార్డుల్లో బుధవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు ఆయుధంతో కాంగ్రెస్‌కు వేటుపడాలన్నారు. రెండేళ్ల పాలనలో ఏ సాధించారో చెప్పాలని కాంగ్రెసోళ్లను నిలదీయాలన్నారు. అధ్వాన రోడ్లు, మురుగు, దోమల బెడద, చెత్త, కరెంటు కోతలు.. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇద్దరు మంత్రులు అరాచక శక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలు, సిండికేట్‌ దందాలు మళ్లీ మొదలయ్యాయని, వాటిని ఆదిలోనే అంతమొందించాలన్నారు. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌ సమావేశాల్లో పాల్గొంటున్నా స్పీకర్‌కు కనపడకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement