కారులో మర్చిపోయిన ఆభరణాలు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

కారులో మర్చిపోయిన ఆభరణాలు అప్పగింత

Feb 3 2026 7:11 AM | Updated on Feb 3 2026 7:11 AM

కారులో మర్చిపోయిన ఆభరణాలు అప్పగింత

కారులో మర్చిపోయిన ఆభరణాలు అప్పగింత

తుర్కపల్లి: లిఫ్ట్‌ అడిగిన వ్యక్తులు కారులో మర్చిపోయిన బంగారు ఆభరణాలు తిరిగి వారికి అప్పగించాడు తుర్కపల్లి మండలానికి చెందిన మడోత్‌ సుధాకర్‌నాయక్‌. వివరాలు.. సుధాకర్‌నాయక్‌ ఆదివారం సాయంత్రం కారులో తుర్కపల్లి నుంచి వరంగల్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలానికి చెందిన సముద్రాల వెంకటయ్య కుటుంబ సభ్యులు లిఫ్ట్‌ అడిగారు. సుధాకర్‌నాయక్‌ వారిని తన కారులో ఎక్కించుకొని స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద దింపాడు. అయితే వెంకటయ్య కుటుంబ సభ్యులు తమ కుమార్తె వివాహం కోసం తీసుకెళ్తున్న 5 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండిని కారులోనే మర్చిపోయారు. ఆభరణాలను గుర్తించిన సుధాకర్‌నాయక్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌కు వెళ్లి వెంకటయ్య కుటుంబ సభ్యులకు అప్పంగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement