మున్సిపాలిటీల అభివృద్ధికి అధిక నిధులు
తిరుమలగిరి (తుంగతుర్తి) : రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి అధిక నిధులు కేటాయిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శాలిగౌరారం నుంచి జనగామ వెళ్తుండగా తిరుమలగిరి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సంకెపల్లి కొండల్‌రెడ్డి, 6వ వార్డు అభ్యర్థి కేశిడి కవితావెంకట్‌రెడ్డి, బోయపల్లి కిషన్ , ఎన్.శాతవాహనరావు, రజనీకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


