ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

Jan 28 2026 8:37 AM | Updated on Jan 28 2026 8:37 AM

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

న్యూస్‌రీల్‌

మున్సిపల్‌ చట్టానికి 61 ఏళ్లు
మున్సిపాలిటీ చట్టం ఏర్పడి 61 ఏళ్లు పూర్తయింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం చట్టానికి పలు మార్పులు చేసింది.

బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026

- 8లో

సూర్యాపేట అర్బన్‌ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేశ్‌ డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్యోగులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహేశ్‌ మాట్లాడుతూ ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పదేళ్ల క్రితమే బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌లు అంగీకరించాయని, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా నేటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులపై పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంక్‌ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో బ్యాంక్‌ ఆఫీసర్‌ల అసోసియేషన్‌ సెక్రటరీ సీహెచ్‌. భాస్కర్‌, యూనియన్‌ బ్యాంక్‌ సెక్రటరీ నరేశ్‌, కెనరా బ్యాంక్‌ సెక్రటరీ సట్టు రామకృష్ణ, ఎస్‌బీఐ కుడకుడ బ్యాంక్‌ సెక్రటరీ హేమలత, వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement