మరమ్మతు పనులు అంతంతే | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు పనులు అంతంతే

Jan 28 2026 8:37 AM | Updated on Jan 28 2026 8:37 AM

మరమ్మతు పనులు అంతంతే

మరమ్మతు పనులు అంతంతే

నాణ్యతతోనే పనులు చేపడుతున్నాం

జాన్‌పహాడ్‌ రోడ్డుపై గుంతలు పడిన చోట రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతోనే చేపడుతున్నాం. జాన్‌పహాడ్‌ దర్గా, శూన్యపహాడ్‌ రోడ్డులో గుంతలు పూడ్చేందుకు సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా నామమాత్రపు పనులు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు.

–ప్రీతి, ఆర్‌అండ్‌బీ, ఏఈ, పాలకవీడు

పాలకవీడు : మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా రోడ్డు మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉర్సు ఉత్సవాలకు వేలాది భక్తులు రాగా రోడ్డు సరిగా లేక పోవడంతో ఈ నెల 17న శ్రీదారిచూపు సైదన్నాశ్రీ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టినా అందులో నాణ్యత పాటించడం లేదు. దాంతో ప్రజాధనం వృథా అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

మట్టిపైనే తారు

రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను పూడ్చే క్రమంలో కనీస నిబంధనలు పాటించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా గుంతల్లో ఉన్న మట్టిని తొలగించి తారు పోయాల్సి ఉండగా అవేమీ లేకుండానే గుంతల్లో తారు కుమ్మరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా జాన్‌పహాడ్‌ రైల్వే ఫ్‌లైవర్‌ పైనుంచి నేరేడుచర్ల, మఠంపల్లి, దామరచర్ల మార్గాలకు వెళ్లే ప్రధాన కూడలి వద్ద పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కేవలం గుంతల్లో తారు పోసి పనులు ముగించారు. మిగిలిన రోడ్డు మొత్తం దుమ్ము మయంగానే ఉంది. శూన్యపహాడ్‌ వద్ద కూడా ౖపైపెనే పనులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

బ్రిడ్జిని వదిలేశారు

మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై మర్మతులు చేపట్టడం లేదు. బ్రిడ్జిపై అడుగుకో గంత ఉండగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

భక్తులకూ తప్పని ఇబ్బంది

ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు మరమ్మతు పనులు చేయాల్సి ఉండగా అధికారులు మాత్రం ఉర్సు ముగిసిన తరువాత పనులు చేపడుతున్నారు. దాంతో ఉర్సుకు వచ్చిన వేలాది మంది రోడ్డుపై గుంతలతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా తాత్కాలిక పనులతో ప్రజా ధనం వృథా అవుతున్నదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతో చేసేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఫ జాన్‌పహాడ్‌ రోడ్డు మరమ్మతు

పనుల్లో నాణ్యత కరువు

ఫ గుంతలు పూడ్చి వదిలేస్తున్న వైనం

ఫ ప్రజాధనం వృథా

అవుతుందంటూ స్థానికుల ఆగ్రహం

ఫ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement