ఉత్తమ్ దంపతులపై కేసు నమోదు చేయాలి
కోదాడ : దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి కారణమైన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్య బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాళీ సూట్‌కేస్‌తో కోదాడకు వచ్చిన మంత్రి వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించాడో అందిరికి తెలుసన్నారు. పౌరసరఫరాలశాఖను అడ్డుపెట్టుకొని మిల్లర్లను బెదిరించి డబ్బులు వసూలూ చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌లు తీసుకొని పనులను అప్పగిస్తున్నారని ఆరోపించారు. గడిచిన 20 ఏళ్లుగా తనను వేధిస్తున్నా భయపడకుండా ఎదురు నిలిచి పోరాటం చేస్తున్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులు ఎస్కార్ట్ కల్పిస్తే ఎగతాళి చేసిన ఉత్తమ్ ఇప్పుడు షేర్ ఆటోవలె హెలీకాఫ్టర్ ఉపయోగించడంతో పాటు ఆయన సతీమణి కోదాడలో రెండు ఎస్కార్ట్ వాహనాలు పెట్టుకొని తిరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌కే. నయీం, రమేశ్‌బాబు, సురేశ్ పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్


