మురిసిన మామిడాల
నల్లగొండ, తిప్పర్తి : తిప్పర్తి మండలం మామిడాల గ్రామం మురిసింది. గ్రామానికి చెందిన యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్‌కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. తమ గ్రామవాసికి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కడంతో గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్‌కుమార్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రొపెసర్‌గా బిజీగా ఉన్నప్పటికీ ఆయన గ్రామంతో విడదీయరాని బంధం ఉంది. ప్రతి సంవత్సరం గ్రామానికి వస్తుంటారని, స్వయకృషితో ఉన్నత స్థాయికి ఎదిగారని గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం
జగదీష్‌కుమార్ తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వచ్చే జీతం సరిపోకపోయినా ముగ్గురు పిల్లలను చదివించారు. ఇంట్లో పెద్దవాడైన జగదీశ్‌కుమార్ ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. చదువుతో.. గౌరవం, పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆయన నమ్మకం. కష్టపడి చదవడం వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఢిల్లీ జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్‌గా, యూజీసీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం పద్మశ్రీ అవార్డు సాధించుకోగలిగారు. ఆయన ఉన్నత చదువుకు తన బంధువులు ఎంతో సాయపడ్డారని ఆయన పలుమార్లు చెప్పారు. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ పాఠవాలు ఉంటాయని.. వాటిని సానబడితేనే వారు మెరికల్లా ఎదుగుతారని చెబుతుంటారు.
ఫ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మామిడాల జగదీశ్‌కుమార్
ఫ కేంద్రం పద్మశ్రీ అవార్డు
ప్రకటించడంతో అంతా హర్షం


