గణతంత్ర వేడుకలకు వేళాయే.. | - | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు వేళాయే..

Jan 26 2026 6:45 AM | Updated on Jan 26 2026 6:45 AM

గణతంత్ర వేడుకలకు వేళాయే..

గణతంత్ర వేడుకలకు వేళాయే..

భానుపురి (సూర్యాపేట) : గణతంత్ర వేడుకలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సూర్యాపేటలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహించే వేడుకలకు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.అనంతరం జిల్లా ప్రగతి నివేదికపై ప్రసంగించనున్నారు. ఆ తరువాత స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రశంస పత్రాల ప్రదానం, స్టాళ్ల సందర్శన ఉంటుంది.

పోలీసుల రిహార్సల్‌

సూర్యాపేటటౌన్‌ : పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లతో పాటు పోలీసుల రిహార్సల్‌ను ఎస్పీ నరసింహ పరిశీలించారు. వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, పరేడ్‌ కమాండర్‌గా రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వ్యవహరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement