జనసంద్రమైన జాన్‌పహాడ్
పాలకవీడు : జాన్‌పహాడ్ సైదన్న ఉర్సులో భాగంగా శుక్రవారం గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ ముజావర్ జానీ ఇంటి వద్ద హైదరాబాద్ నుంచి నుంచి తీసుకొచ్చిన గంధం కలశాన్ని ఎత్తుకొని సమీపంలోని చందల్‌ఖానాకు తరలించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గంధాన్ని ప్రత్యేకంగా అలంకరించిన గుర్రం పైకి చేర్చి ఊరేగించారు. గంధోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దర్గా పరిసరాలు కిక్కిరిసాయి. జాన్‌పహాడ్, కల్మేట్‌తండా, చెరువుతండా గ్రామాల గుండా గంధాన్ని ఊరేగించుకుంటూ దర్గాకు చేర్చారు. గంధం దర్గాలోకి చేరే సమయంలో 30 నిమిషాల పాటు భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. గంధాన్ని బాబా సమాధులకు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులను దర్శనానికి పంపించారు. గంధాన్ని తాకేందుకు భక్తులు పోటీపడడంతో స్వల్ప తోపులాట జరగగా.. పోలీసులు నిలువరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో సుమారు 65 మంది కార్మికులను నియమించారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ముందస్తు చర్యులు చేపట్టారు. పోలీసులు కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి భక్తులను అప్రమత్తం చేశారు. మిర్యాలగూడ, కోదాడ డిపోల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును దర్గాకు నడిపారు. ఎక్సైజ్, అగ్నిమాపక, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో పాటు 450 మంది పోలీసులు విధులు నిర్వహించినట్లు సీఐ చరమందరాజు పేర్కొన్నారు.
భక్తుల ఇక్కట్లు..
గంధోత్సవానికి ఒక రోజు ముందుగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బస చేయడానికి షెల్టర్లు లేక అవస్థలు పడ్డారు. స్నానాలు చేసే చోట దస్తులు మార్చుకునేందుకు గదులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎప్పటికప్పుడు దర్గా పరిసరాల్లో చెత్తాచెదారాన్ని తొలగించలేదని, తాగునీటి ట్యాకులు శుభ్రంగా లేవని భక్తులు ఆరోపించారు. దర్గాకు కిలోమీటరు దూరంలో వాహనాల పార్కింగ్‌కు స్థలాలు కేటాయించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఘనంగా గంధోత్సవం
హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సైదన్న ఆశీస్సులతో అభివృద్ధి చేస్తున్నా : మంత్రి ఉత్తమ్
జాన్‌పహాడ్ దర్గా వద్ద కోటిన్నర ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ప్రారంభించి సైదన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాన్‌పహాడ్ దర్గాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట ఎస్పీ నరింహ, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏవీ సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాలోతు మోతీలాల్, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, బెల్లంకొండ నరసింమారావు, గుత్తికొండ భూపాల్‌రెడ్డి, రమావత్ నీమానాయక్, భూక్యా చరణ్‌సింగ్, కెలావత్ కవిత, కిరణ్, సైదానాయక్, నాగరాజు తదితరులు ఉన్నారు.
జనసంద్రమైన జాన్‌పహాడ్
జనసంద్రమైన జాన్‌పహాడ్
జనసంద్రమైన జాన్‌పహాడ్


