‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు | - | Sakshi
Sakshi News home page

‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు

Jan 24 2026 8:56 AM | Updated on Jan 24 2026 8:56 AM

‘మన స

‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు

ఆలేరురూరల్‌ : స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేస్తుంది. ఇంటి వద్దనే ఉండి వివిధ వ్యాపారాలు నిర్వహించేలా సభ్యులకు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ అతివలకు అండగా నిలుస్తోంది. కాగా స్త్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా మన సీ్త్రనిధి యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా రుణాల పంపిణీ, చెల్లింపుల విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్‌ పెట్టడంతో పాటు రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో కిస్తీలు చెల్లించవచ్చు. అదేవిధంగా సభ్యులు చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయ్యిందా లేదా అనే సరిచూసుకోవచ్చు. ఈ యాప్‌ గురించి అధికారులు, సీ్త్రనిధి బ్యాంక్‌ సిబ్బంది మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్నారు.

దరఖాస్తు సులభం..

గతంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీఓఏలు తీర్మానం చేసి రుణాలు కేటాయించేవారు. దీంతో వారిని బతిమాలడంతో పాటు ఎంతో కొంత సమర్పించాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వ కొత్తగా తీసుకొచ్చిన మన సీ్త్రనిధి యాప్‌ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు వీఓఏలు, సీసీల చుట్టూ తిరగకుండా.. స్మార్ట్‌ఫోన్‌లో మన సీ్త్రనిధి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని నేరుగా దరఖాస్తు రుణాల కోసం చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌లో వీఓఏకు వెళ్తుంది. 24 గంటల్లో దానిని అప్రూవల్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే సంబంధిత ఏపీఎంకు వెళ్తుంది. ఆయన పరిశీలించి అసిస్టెంట్‌ మేనేజర్‌ సీ్త్ర నిధికి పంపిస్తారు. వారు ఆమోదం తెలిపితే రీజినల్‌ మేనేజర్‌ ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అక్కడ నుంచి ఆమోదం లభిస్తే రుణం నేరుగా సభ్యుల ఖాతాల్లోకి చేరుతుంది.

అక్రమాలకు చెక్‌

ఇదివరకు రుణాలు పొందిన సభ్యులు తిరిగి కడుతున్నారో లేదో తెలిసేది కాదు. కానీ ఈ యాప్‌లో సభ్యులు తీసుకున్న రుణాల సమగ్ర సమాచారం ఉంటుంది. ఏ సభ్యురాలు ఎంత రుణం తీసుకుంది, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది వంటి వివరాలు యాప్‌లో ఉంటాయి. అలాగే రుణం చెల్లించేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా యాప్‌ ద్వారా కిస్తీలు చెల్లించవచ్చు.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌లో మన సీ్త్రనిధి తెలంగాణ అని టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో వచ్చే పర్మిషన్స్‌ అన్నింటిని అలో చేయాలి. యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత 3 ఆప్షన్స్‌ కనిపిస్తాయి. సంఘం అకౌంటింగ్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేసి సంఘం సభ్యురాలి మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత ఓటీపీ జనరేట్‌ అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేస్తే యాప్‌ ఓపెన్‌ అవుతుంది. ఒకవేళ మొబైల్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ చేయమని చూపించినట్లయితే మండల సీ్త్ర నిధి మేనేజర్‌ను సంప్రదించి సంఘం సభ్యురాలి మొబైల్‌ నంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మరిన్న వివరాలకు సీ్త్రనిధి పేద మహిళల పెన్నిధి– తెలంగాణ యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేసి అందులో చూపించే వీడియోల ఆధారంగా కూడా మన సీ్త్ర నిధి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

స్వయం సహాయక సంఘాలకు

అందుబాటులోకి ప్రత్యేక యాప్‌

అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం

రుణ కిస్తీలు చెల్లించడానికి

ఇక సులభతరం

సంఘాలకు అవగాహన

కల్పిస్తున్న అధికారులు

సభ్యులకు ఎంతో ప్రయోజనం

సీ్త్రనిధి రుణాలు పొందాలనుకునే వారు, ఇది వరకు రుణాలు తీసుకున్న వారు స్మార్ట్‌ఫోన్లలో మన సీ్త్రనిధి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రుణాల కోసం నేరుగా యాప్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. చెల్లించాల్సిన వాయిదాల వివరాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకోచ్చు. దీంతో సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

– గోకినేపల్లి రామకృష్ణ,

సీ్త్రనిధి రీజినల్‌ మేనేజర్‌

‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు1
1/2

‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు

‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు2
2/2

‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement