ప్రైవేటు వాహనాలే దిక్కు!
ఆత్మకూరు (ఎస్) : ఆత్మకూర్(ఎస్) మండల వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతి గ్రామం నుంచి పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా ఆత్మకూర్(ఎస్)మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్‌కు వచ్చేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రం, వివిధ గ్రామాల నుంచి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. కొన్ని గ్రామాల లో ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు పక్క గ్రామాల విద్యార్థులు సైకిళ్లు, కాలినడకన వెళుతున్నారు. వివిధ గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు సైతం ప్రైవేట్ వాహనాల్లోనే విధులకు హాజరవుతున్నారు.


