బడి వేళకు బస్సేది..!
అణిచివేయడం సరికాదు
ప్రశ్నించే వారిని అణిచివేయడం సరికాదని అరుణోదయ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు.
శిక్షపడే వరకు ఉద్యమం
కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులకు శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని మంద కృష్ణమాదిగ అన్నారు.
- 8లో
మాది చాకిరాల గ్రామం. మా ఊరుకు చెందిన 20 మంది విద్యార్థులు రామాపురం జెడ్పీ హైస్కూల్‌లో టెన్త్ చదువుతున్నాం. రోజూ ఆరు కిలోమీటర్లు వెళ్లొస్తున్నాం. మాకు బస్సు సౌకర్యం కల్పించాలి. – పెదపంగు నాని, టెన్త్ విద్యార్థి, చాకిరాల
నడిగూడెం : మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు వేరే ఊర్లలో చదువుకునేందుకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. చాకిరాల గ్రామం నుంచి పలువురు విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం నడిచి వెళ్తున్నారు. అలాగే చెన్నకేశ్వాపురం, వేణుగోపాలపురం, బృందావనపురం, కాగితరామచంద్రాపురం నుంచి పలువురు విద్యార్థుల రెండున్నర కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి కరివిరాల మోడల్ స్కూల్‌కు నడిచి వెళ్తున్నారు. ఇంకా పలువురు విద్యార్థులకు సైకిళ్లపై వివిధ పాఠశాలలకు వెళ్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
బడి వేళకు బస్సేది..!
బడి వేళకు బస్సేది..!


