రోడ్డు ప్రమాదాల నివారణ.. అందరి బాధ్యత
సూర్యాపేట టౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్–అలైవ్ రోడ్డు భద్రత మహాద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 2వేల మంది విద్యార్థులు, వివిధ వాహనాల డ్రైవర్స్, స్థానిక యువత, ప్రజలతో కలిసి రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. స్థానిక 60 ఫీట్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ నల్లాలబావి సెంటర్ మీదుగా ఏవీఎం పాఠశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారణకే రాష్ట్ర పోలీస్ శాఖ అరైవ్– అలైవ్ పేరుతో రోడ్డు భద్రత మహోద్యమం ప్రారంభించిందన్నారు. పోలీస్ సేవల్లో వేగం పెంచడంలో భాగంగా రాష్ట్ర డీజీపీ బాధితుల ఇంటివద్దకే పోలీస్, ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్ అనే ప్రణాళికను తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, ఎంవీఐ ఆదిత్య, ఎస్‌ఐలు, ఆర్టీఏ సిబ్బంది పాల్గొన్నారు.
వాహనదారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు
హుజూర్‌నగర్ : వాహనదారుల నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్, రోడ్డు భద్రత మహోద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం హుజూర్‌నగర్‌లోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు చరమందరాజు, రామారావు, ఎస్‌ఐ మోహన్‌బాబు, పాఠశాల చైర్మన్ మర్రెడ్డి, ప్రిన్సిపాల్ రాజారెడ్డి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
ఫ సూర్యాపేటలో అరైవ్–అలైవ్
ర్యాలీ, హుజూర్‌నగర్‌లో
అవగాహన కార్యక్రమం


