దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దు | - | Sakshi
Sakshi News home page

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దు

Jan 23 2026 6:29 AM | Updated on Jan 23 2026 6:29 AM

దమ్ము

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దు

సూర్యాపేట టౌన్‌ : దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దని, తద్వారా రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రైతులు, ట్రాక్టర్‌ యజమానులు దీనిని గమనించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు, ఇతర అవసరాల దృష్ట్యా ఎవరైనా రోడ్లను తవ్వితే సంబంధిత శాఖ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. నిబందనలు అతిక్రమిస్తే రూ.5వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

జిల్లాను పర్యాటక

కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సద్దలచెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద రూ.5 కోట్ల నిధులతో ట్యాంక్‌ బండ్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి రాజా, వుర రామ్మూర్తి యాదవ్‌, వెలుగు వెంకన్న, ముదిరెడ్డి రమణారెడ్డి, ఫరూక్‌, వల్దాస్‌ దేవేందర్‌, నిమ్మల వెంకన్న, యాట వెంకన్న, పాలగాని కృష్ణ, కొండగడుపుల సూరయ్య, సైదిరెడ్డి, టూరిజం శాఖ ఏఈ మణికంఠ పాల్గొన్నారు.

పెండింగ్‌ డీఏలు చెల్లించాలి

పెన్‌పహాడ్‌ : ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌ డీఏలు, ఏరియల్స్‌ వెంటనే చెల్లించాలని టీఎస్‌ సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్‌కుమార్‌, జిల్లా కోశాధికారి గుయ్యని ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేశ్వర్‌, విజయలక్ష్మి, సంపత్‌కుమార్‌, సంపత్‌, మౌనిష్‌, వెంకటేశ్వర్లు, సతీష్‌, శివ, జానీ, సంజయ్‌, సందీప్‌, ఉదయ్‌, మోక్షిత్‌ పాల్గొన్నారు.

ఆర్టీఓ కార్యాలయ

పనులు పూర్తిచేస్తాం

కోదాడ రూరల్‌ : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర నుంచి మండల పరిధిలోని గుడిబండ శివారులోకి మారుస్తున్న కోదాడ ఆర్టీఓ (రవాణా శాఖ) కార్యాలయం పనులు ఫిబ్రవరి 1 నాటికి పూర్తిచేస్తామని జిల్లా రవాణా శాఖ ఇన్‌చార్జి అధికారి జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. కార్యాలయం ఏర్పాటుకు గుడిబండ శివారులోని సర్వేనంబర్‌ 408 బై2బైబీలో గల రెండెకరాల ప్రభుత్వ భూమిలో యూనిట్‌ ఎంవీఐ షేక్‌.జిలానీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యాలయంలో భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట కోదాడ యూనిట్‌ ఎంవీఐ షేక్‌.జిలానీ, ఎంవీఐలు రాజ్‌మహ్మద్‌, కె.శ్రీనివాసులు, ఏఎంవీఐలు సంపత్‌గౌడ్‌, జీఆర్‌.చరణ్‌ సిబ్బంది ఉన్నారు.

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దు1
1/1

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement