పార్టీల సన్నాహకం! | - | Sakshi
Sakshi News home page

పార్టీల సన్నాహకం!

Jan 23 2026 6:29 AM | Updated on Jan 23 2026 6:29 AM

పార్టీల సన్నాహకం!

పార్టీల సన్నాహకం!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆయా పార్టీలు మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు వేగవంతం చేశాయి. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ వివిధ మున్సిపాలిటీల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వడబోత చేపట్టగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరికొందరు ఆశావహులు టికెట్లపై హామీల కోసం ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

కసరత్తు వేగవంతం

సూర్యాపేటలో మున్సిపల్‌ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్‌.. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా, బీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వర్‌రావు సమావేశాలు నిర్వహించారు. గెలిచే అభ్యర్థుల కోసం వార్డుల వారీగా సర్వే చేయిస్తున్నారు. లెఫ్ట్‌ పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని సీపీఎం ప్రకటించింది.

భారీగా దరఖాస్తులు

కోదాడలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. 35 వార్డులకు 350 మంది దరఖాస్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మూడు వార్డులకు ఒక సమావేశం చొప్పున నిర్వహించింది. హుజూర్‌నగర్‌, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తిరుమలగిరి, మోత్కూర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఆధ్వర్యంలో, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఆధ్వర్యంలో ఆయా పార్టీల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఫ మున్సిపాలిటీల వారీగా

సమావేశాల నిర్వహణ

ఫ అభ్యర్థుల నుంచి

దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన

ఫ అవసరమైన చోట సర్వేలు, వాటి

ఆధారంగానే టికెట్లు

ఫ ఎన్నికలకు సిద్ధమైన పార్టీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement