నేడు గవర్నర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌ రాక

Jan 23 2026 6:29 AM | Updated on Jan 23 2026 6:29 AM

నేడు గవర్నర్‌ రాక

నేడు గవర్నర్‌ రాక

హుజూర్‌నగర్‌, మఠంపల్లి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సతీసమేతంగా శుక్రవారం మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌బందోబస్తు నిర్వహించనున్నారు.

గవర్నర్‌ పర్యటనలో ఎలాంటి

లోటుపాట్లు ఉండొద్దు : కలెక్టర్‌

మఠంపల్లి : రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం కలెక్టర్‌ మఠంపల్లి మండలం మట్టపల్లిలో గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించనున్న యాత్రి కాసదన్‌, వంటశాల, సీసీజీఐ షెడ్డు, సీసీరోడ్లకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అదేవిధంగా వేదిక, ఎల్‌ఈడీల ఏర్పాటు, వ్యవసాయ, ఉద్యానవన, గృహనిర్మాణ, నీటిపారుదల, డీఆర్‌డీఏ, విద్యా శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్‌ను గవర్నర్‌ పరిశీలించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వారి వెంట ఆలయ అనువంశిక ధర్మకర్తలు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు ఉన్నారు.

గవర్నర్‌ పర్యటన షెడ్యూల్‌

ఫ ఉదయం 10.45 గంటలకు హైదబాద్‌లోని బేగంపేట నుంచి బయలుదేరుతారు.

ఫ 11.45కు మట్టపల్లికి చేరుకుంటారు.

ఫ 12 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

ఆలయంలో ప్రత్యేక పూజలు

ఫ 12.30 నుంచి 12.40 వరకు స్టాళ్ల సందర్శన

ఫ 1.40 నుంచి 2.30 వరకు మధ్యాహ్న భోజనం

ఫ 2.40గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం.

ఫ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజలు చేయనున్న జిష్ణుదేవ్‌ వర్మ

ఫ వివిధ శాఖల స్టాళ్ల సందర్శన

ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement