నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నాయని, విద్యార్థులు వాటికి అనుగుణంగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించాలన్నారు. రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇంగ్లిష్ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. రీసెంట్ టెక్నాలజీస్ గురించి అవగాహనా పెంచుకోవాలని, విద్యార్థులు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. టీచర్స్ కూడా రీసెంట్ టెక్నాలజీపై ట్రైనింగ్ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు ముత్యాల, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలి
అనంతరం కళాశాల బయట రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. నేటి యువత చదువుతోపాటు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, మరో పదేళ్లలో ఇంకా మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు, యువత ముందుకెళ్లాలన్నారు. మనదేశానికి నేనేం చేయాలనే ఆలోచన చేసి స్పేస్ లాలో ఒక చట్టం కావాలని చెప్పి స్పేస్ లా చట్టం తీసుకొచ్చి పార్లమెంట్‌కు ఇచ్చానన్నారు. ప్రపంచం భారతదేశం వైపు చూస్తుందని, మన దేశ అతిపెద్ద సంపద యూత్ అన్నారు. డిగ్రీతో పాటు నాలెడ్జ్ ఉంటే విద్యార్థి ఎక్కడైనా రాణించగలుతాడన్నారు. అనేక రంగాలల్లో ఉద్యోగవకాశాలు ఉన్నాయనిన్నారు. టీజీసీహెచ్‌ఈ వెబ్‌సైట్‌లో మొదటి సారి విద్యను కేవలం సిలబస్‌గా మార్చడం కాకుండా లెర్నింగ్ మెటీరియల్‌ను తయారు చేసి పెట్టామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వాటిని వెబ్‌సైట్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఫ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్
ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి


