రోజూ కష్టాలే..
అర్వపల్లి : అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోల్లో వచ్చి చదువుకుని వెళుతున్నారు. అయితే కొత్తగూడెం నుంచి ఈ పాఠశాలకు 10 మంది ఆటోలో వచ్చిపోతారు. ఈ గ్రామానికి ఇంతవరకు బస్సు సౌకర్యం లేదు. అలాగే బొల్లంపల్లి నుంచి 10 మంది, అడివెంల నుంచి 22 మంది, వేల్పుచర్ల నుంచి 13 మంది విద్యార్థులు అర్వపల్లి వచ్చి వెళ్తున్నారు. వీరంతా ఆటోలు ఇతర వాహనాల్లో వచ్చి పోతుంటారు. ఆయా గ్రామాలన్నిటికి బస్సుల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులకు ప్రతిరోజూ ప్రయాణ కష్టాలు తప్పడం లేదు.


