అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జాన్‌పహాడ్ ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వ ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్పీ రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన దర్గా వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. 60 మంది కార్మికులతో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు. మిర్యాలగూడ, కోదాడ ఆర్టీసీ డిపోల నుంచి 18 బస్సులను దర్గాకు నడుపుతున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు పేర్కొన్నారు. దర్గా పరిసరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతామని వైద్యారోగ్యశాఖ అధికారి నాగిని వివరించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు సీలు, 27మంది ఎస్‌ఐలు, రోప్‌పార్టీ బలాలు, మొత్తం 450 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉర్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ చరమందరాజు, ఎస్‌ఐ కోటేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


