అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
వలిగొండ : మండలంలోని రెడ్లరేపాక గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. రెడ్లరేపాకకు చెందిన పంతంగి వెంకటేశం అతని కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసి అమ్ముతున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడి చేసి రూ.61,473 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
ఇల్లు ఖాళీ చేయాలని..
ఫ తండ్రికి కోర్టు నోటీసు పంపిన కొడుకు
నడిగూడెం : ఇల్లు ఖాళీ చేయాలని తండ్రికి కొడుకు కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. ఈ సంఘటన నడిగూడెం మండలం చాకిరాలలో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన గుంజ లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఎంతో కష్టపడి తన పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లును చదివించి ప్రయోజకుడిని చేశాడు. లక్ష్మయ్య చిన్న కుమారుడు రాంబాబు కులాంతర వివాహం చేసుకున్నాడు. లక్ష్మయ్య ఇంటిని 2025లో రాంబాబు తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో కక్ష కట్టిన వెంకటేశ్వర్లు.. లక్ష్మయ్య ఉంటున్న ఇల్లును ఖాళీ చేయాలంటూ కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. గత ఏడాదిగా తన ఆరోగ్యం బాగోలేదని, తనను చిన్న కుమారుడు రాంబాబు పోషిస్తున్నాడని లక్ష్మయ్య తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.


