ఇంటి వదే్ద ఎఫ్‌ఐఆర్
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట టౌన్ : ప్రజలకు ఏరకమైనా ఇబ్బందులు ఎదురైనా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వినూత్నంగా ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) నమోదు కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టింది. ఫోన్ చేస్తే చాలు బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి అక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జిల్లాలో అమల్లోకి తీసుకొచ్చారు.
తొలి ఫిర్యాదు తెల్లబెల్లి నుంచి..
ఇందులో భాగంగా బుధవారం రాత్రి నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన భూమా రమాదేవి అనే దివ్యాంగురాలు తన భర్త కొడుతున్నాడని డయల్ 100కు ఫోన్ చేసి తొలి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న నడిగూడెం ఎస్‌ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితురాలికి అందించారు. ఈ విధానం వల్ల జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో
ఫిర్యాదు చేయొచ్చు..
పోలీస్ శాఖ అమలు చేస్తున్న కొత్త విధానంతో పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న బాధితులు ఇక నుంచి ఇంటి వద్ద నుంచే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేసి బాధితులకు భరోసా కల్పించనున్నారు. ఈ కొత్త విధానం శారీరక దాడులు గురయ్యే వారికి, ఎస్టీ, ఎస్టీ వర్గాల ప్రజలకు, బాలలకు, ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులకు, వేధింపులకు గురయ్యే మహిళలకు ఎంతో సహాయపడనుంది. దీని ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ఫోన్ చేసి చెప్పినా చాలు..
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని బాధితులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు ఫోన్ కాల్, ఆన్‌లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తారు. దీంతో శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ నిరోధక చట్టం, మైనర్ వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఉపయుక్తంగా మారనుంది.
ఫ ఫోన్ చేస్తే చాలు బాధితుల
ఇంటికే పోలీసులు
ఫ డీజీపీ ఆదేశాలతో కార్యాచరణ
ఫ ప్రారంభం రోజే తొలి ఫిర్యాదు చేసిన తెల్లబెల్లికి చెందిన దివ్యాంగురాలు
ఫ సమాచారంతో బాధితురాలి
ఇంటికి వెళ్లి కేసు నమోదు
ఫ సత్వర న్యాయం అందించేందుకు కొత్త విధానం అమలులోకి..
పోలీస్ శాఖ తీసుకొచ్చిన కొత్త విధానంతో బాధితులు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసి భరోసా కల్పిస్తారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. పోలీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– నరసింహ, జిల్లా ఎస్పీ
ఇంటి వదే్ద ఎఫ్‌ఐఆర్


