23న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన | - | Sakshi
Sakshi News home page

23న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన

Jan 22 2026 8:27 AM | Updated on Jan 22 2026 8:27 AM

23న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన

23న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన

విహారయాత్రకు వెళ్లొస్తుండగా..
డిండి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఏపీలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

నేటి నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు

జాన్‌పహాడ్‌ సైదన్న దర్గా ఉర్సు గురువారం ప్రారంభంకానుంది. మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి.

- 8లో

హుజూర్‌నగర్‌, మఠంపల్లి : హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి గవర్నర్‌ దంపతులు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.45 గంటలకు మఠంపల్లి మండలం మట్టపల్లి చేరుకుంటారు. అక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు హుజూర్‌నగర్‌ చేరుకుని మగ్దూంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు, కోదాడలో నిర్మించే జవహర్‌ నవోదయ విద్యాలయం శిలాఫలకాన్ని గవర్నర్‌ ఇక్కడే ఆవిష్కరించనున్నారు. అనంతరం 1.35 గంటలకు మఠంపల్లి మండలంలోని ఎన్‌సీఎల్‌ గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2.40 గంటలకు మట్టపల్లి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు.

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : కలెక్టర్‌

మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ వివిధ శాఖల అదికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ సీతారామారావుతో కలిసి మట్టపల్లిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. గవర్నర్‌ కేవలం కొద్ది నిమిషాల పాటే ఆలయంలో గడుపుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, వేణుమాదవ్‌, తహసీల్దార్‌ మంగా రాథోడ్‌, ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు, ఆలయ ఈఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఫ మట్టపల్లి క్షేత్రంలో పూజలు

చేయనున్న గవర్నర్‌ దంపతులు

ఫ హుజూర్‌నగర్‌లో వ్యవసాయ

కళాశాల నిర్మాణానికి శుంకుస్థాపన

ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement