సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి

Jan 22 2026 8:27 AM | Updated on Jan 22 2026 8:27 AM

సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి

సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి

సూర్యాపేట టౌన్‌ : ఉపాధ్యాయులు శిక్షణ ద్వారా నూతన సాంకేతికత నైపుణ్యం పెంపొందించుకుని విద్యార్థులకు అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వారు నిర్వహిస్తున్న ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఎంపవరింగ్‌ కేజీబీవీ వార్డెన్స్‌ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభత్వ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌.. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్‌, నోడల్‌ ఆఫీసర్‌ పూలన్‌, మాస్టర్‌ ట్రైనర్స్‌ నిర్మల జ్యోతి, తవిటి నాయుడు, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు పక్కాగా పరిష్కరించాలి

భానుపురి (సూర్యాపేట) : లైసైన్స్‌డ్‌ సర్వేయర్లు భూ సమస్యలను పక్కాగా పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. గ్రామాల్లో భూమి కొలతల సమస్య తీర్చేందుకు రాత పరీక్ష ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసిన మొదటి బ్యాచ్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల 45 రోజుల శిక్షణకాలం పూర్తయిన సందర్భంగా బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత శిక్షణ పూర్తిచేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌లు నూతన నైపుణ్యంతో భూభారతి, ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలు ఉన్న భూములను సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలన్నారు. తహసీల్దార్లు, జీపీఓల సహాయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement