రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
సూర్యాపేటటౌన్ : రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృ త అవగాహన కల్పించాలని, అరైవ్– అలైవ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎస్పీ నరసింహ పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించి గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. కేసు దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేరారు. నేర నిరూపణలో సిబ్బంది సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలని, ఫిర్యాదులపై త్వరగా స్పందించి ఘటనా స్థలానికి త్వరగా చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పకడ్బందీగా చేపట్టాలని, కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలని సూచించారు. పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో వేగంగా దర్యాప్తు చేసి కోర్టులతో సమన్వయం చేసుకుంటూ నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వాహన దారులు, ప్రజలను రోడ్డు భద్రతపై అప్రమత్తం చేయాలని సూచించారు. నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలు, వ్యాపారులను ప్రోత్సహించాలని ఆదేశించారు. సమావేశంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, డీసీ ఆర్బీ డీఎస్పీ రవి, సీఐలు పాల్గొన్నారు.
ఎస్పీ నరసింహ


