ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక

Nov 26 2025 8:09 AM | Updated on Nov 26 2025 8:09 AM

ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్‌  క్రీడాకారుల ఎంపిక

ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక

మేళ్లచెరువు : చింతలపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నల్లగొండ జిలా అండర్‌ 14,అండర్‌ 17 బాలబాలికల సాఫ్ట్‌బాల్‌ సెలక్షన్స్‌ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలను తహసీల్దార్‌ సురేందర్‌రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్‌లు ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ సెలక్ట్‌ అయిన జట్లు వచ్చే నెల జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ప్రతి జట్టు నుంచి 16 మంది క్రీడాకారులను ఎంపికచేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఈటీ ఉస్మాన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రంగాచారి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, వీరన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement