బాలికల విద్యకు బాసట
కేజీబీవీ శిక్షణ
నాగారం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే పేద, ప్రతిభ గల విద్యార్థినులకు ఉన్నత విద్యావకాశాలు దక్కేలా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థినులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చేరేలా నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీలను యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (వైఐఐఓఈ) కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. ఇందుకోసం కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేల నుంచి లక్షల రూపాయలు చెల్లించి శిక్షణ తీసుకుంటారు. అలాంటి అవకాశాన్ని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు అందించాలనే సంకల్పంతో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి శని, ఆదివారాల్లో పాఠశాల వేళలు ముగిసిన తర్వాత తరగతులు నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంబీబీఎస్‌లో చేరేలా నీట్, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేలా ఐఐటీ–జేఈఈ, న్యాయవాద వృత్తి చేపట్టేలా– క్లాట్‌కు విద్యార్థినులను సన్నద్ధం చేయనున్నారు. ఎంపిక చేసిన కేజీబీవీ విద్యార్థినులకే శిక్షణ ఇస్తారా? లేక ఆసక్తి గలవారికి పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఒకచోట శిక్షణ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. వైఐఐఓఈ కేంద్రాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లను సమకూర్చి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. నిపుణుల ఎంపిక, ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల నియామకం చేపట్టాల్సి ఉన్నందున మార్గదర్శకాలు విడుదల కాలేదు.
వీరికి మేలు..
జిల్లాలోని మూడు పెన్‌పహాడ్, గడ్డిపల్లి, చింతలపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు వైఐఐఓఈ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. వీటిలో పెన్‌పహాడ్ కేజీబీవీలో ఐఐటీ జేఈఈ (ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి), గడ్డిపల్లి కేజీబీవీలో నీట్ (ఎంబీబీఎస్‌కు సంబంధించి), చింతలపాలెం కేజీబీవీలో క్లాట్(న్యాయవాద వృత్తికి సంబంధించి) ద్వితీయ సంవత్సరం చదివే బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
పెన్‌పహాడ్ ఐఐటీ జేఈఈ
గడ్డిపల్లి నీట్
చింతలపాలెం క్లాట్
ఫ కేజీబీవీల్లో ఐఐటీ, నీట్, క్లాట్‌కు ఉచితంగా శిక్షణ
ఫ జిల్లాలో మూడు
విద్యాలయాలు ఎంపిక
ఫ ద్వితీయ సంవత్సరం
చదవి విద్యార్థినులకు ప్రయోజనం


