మహిళా సంఘాలకు చేయూత | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు చేయూత

Nov 26 2025 8:09 AM | Updated on Nov 26 2025 8:09 AM

మహిళా సంఘాలకు చేయూత

మహిళా సంఘాలకు చేయూత

రుణాల పంపిణీ ఇలా..

కోదాడ: స్వయం సహయక సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించి ప్రభుత్వం చేయూత నిచ్చింది. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయా సంఘాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 9,323 సంఘాలకు రూ. 6.99 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. కోదాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రామారావు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేల్‌, సూర్యాపేటలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో డీఆర్‌డీఓ అప్పారావు రుణాలు అందజేశారు.

నియోజకవర్గాల వారీగా..

కోదాడ నియోజకవర్గంలో మొత్తం 2,713 సంఘాలకు రూ. 2.10 కోట్లు, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని 2,888 సంఘాలకు రూ. 2.12 కోట్లు, సూర్యాపేట నియోజకవర్గంలో 1,998 సంఘాలకు రూ. 1.51 కోట్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో 1724 సంఘాలకు రూ. 1.24 కోట్ల చొప్పున రుణాలు మంజూరు కావడంతో పంపిణీ చేశారు.

మండలం సంఘాలు అందించిన

రుణాలు(రూ.లక్షల్లో)

చింతలపాలెం 291 26.09

గరిడేపల్లి 717 49.06

హుజూర్‌నగర్‌ 360 34.06

మఠంపల్లి 423 38.07

మేళ్లచెరువు 367 20.09

నేరేడుచర్ల 390 24.09

పాలకవీడు 340 17.17

అనంతగిరి 496 41.96

చిలుకూరు 432 31.80

కోదాడ 547 51.68

మోతె 293 17.89

మునగాల 554 32.10

నడిగూడెం 391 35.53

ఆత్మకూరు (ఎస్‌) 537 41.87

చివ్వెంల 452 36.52

పెన్‌పహాడ్‌ 470 37.91

సూర్యాపేట 539 35.61

జాజిరెడ్డిగూడెం 310 23.61

మద్దిరాల 269 23.08

నాగారం 289 14.24

నూతనకల్‌ 348 29.32

తిరుమలగిరి 139 11.17

తుంగతుర్తి 369 23.33

ఫ రూ.6.99కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ

ఫ 9,323 సంఘాలకు లబ్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement